Roshayya Jayanti : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ రోషయ్య జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు గట్టు మహేష్ బాబు మాట్లాడుతూ రోషయ్య ఆర్థిక మంత్రి గా దేశం లోనే అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహనీయుడు ఉమ్మడి రాష్ట్రాలలో ప్రజల అందరి హృదయాలలో ఇప్పటి వరకు కూడ వారు చేసిన సేవలు చిరస్థాయిగా ఎవరు మరచిపోకుండా గుర్తు పెట్టుకునే స్థాయిలో వారు నాయకత్వన్ని అందించి బుడుగు బలహీన వర్గాల కొరకై ప్రజ సేవకే వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఇతర రాష్ట్రాల ప్రజలందరికి ఆదర్శవంతులుగా నిలిచినటువంటి రోషయ్య అన్నారు. ఈ జయంతి సందర్భంగా నివాళులు తెలియజేయడం జరిగింది సుమారు 60 మంది పేద మహిళ లకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ జిల్లా ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు పుల్లూరు మధు ,గంప అమర్ నాథ్, తాటిపెల్లి రాజేశ్వర్ రావు, గుమ్మడవెల్లి సురేష్ ,మునిగేటి రమేష్ మంచాల విజయ్ కుమార్ ఎలాగందుల రమేష్ , బెజగం రజినీకాంత్ , ఆనంతుల కుమారస్వామి , గుండా రాజేష్ వంగల శ్రీధర్ బాబు , తోట సోమేశ్వర్ ఇవిఫ్ మహిళా విభాగ్ అధ్యక్షురాలు వల్లల శైలజ తదితరులు పాల్గొన్నారు.