Vasavi club : వాసవి క్లబ్ సభ్యులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి తాము ఆర్థికంగా ఆదుకుంటామని వాసవి క్లబ్ నాయకులు అన్నారు. ఇటీవల చనిపోయిన వేముల సంతోషకుమారు కుటుంబ సభ్యులకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుండి 3,18,900 రూపాయల చెక్కును వరంగల్ పిన్నవారి వీధి లోని కార్యాలయం లో అంద చేసారు. కార్యక్రమం లో తోనుపు నూరి వీరన్న, డిస్ట్రిక్ట్ గవర్నర్ వేమిశెట్టి కిషోర్ కుమారు,ఐఇసి ఆఫీసర్ మల్యాల వీర మల్లయ్య , వారి కుటుంబానికి ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్క వాసవి క్లబ్ సభ్యుడు ” వాసవి కుటుంబ సురక్ష పథకం” లో చేరాలని తద్వారా వారి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని ,ఏమైనా ప్రమాదవశాత్తు జరగరానిది జరిగినచో వారి కుటుంబానికి ఈ యొక్క పథకం ఎంతో మేలు చేస్తుందని డిస్టిక్ గవర్నర్ తెలిపారు. అలాగే వాసవి క్లబ్ సేవలు ఒక ఆర్యవైశ్యులకే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు కూడా అందుతున్నాయని, భారత దేశంలో ఎన్నో క్లబ్ లు ఉన్నాయని కానీ ఒక వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కు మాత్రమే రాష్ట్రపతి అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం దగ్గర సరస్వతీ పుష్కరాలకు అశేష మైన భక్తులకు కూడా అన్న ప్రసాద వితరణ వేలాదిమంది భక్తులకు అందిస్తున్నామని , ఈ అవకాశాన్ని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజలందరూ వినియోగించు కోవాలని కోరారు. మంచాల విజయ్ కుమార్, బెలిదే వెంకటేశ్వర్లు , పబ్బతి నాగభూషణం, సంపత్ , ఘన్ను సంపత్, ఉప్పల వెంకటేశ్వర్లు,పాల మదన్మోహన్, దుబ్బా నారాయణ, అమర్నాథ్ ,సందుపట్ల మార్కండేయ , గుండా ముక్తేశ్వర్, కె శ్రీలత , వి ప్రవీణా తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ప్రతినిధి.