District Collector : హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని పీఎం ఎంపీపీ ఎస్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.ఈ విద్యా సంవత్సరానికి గాను ఎంత శాతం విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ అయిందని, కొత్త యూనిఫామ్స్ విద్యార్థులకు ఇచ్చారా,ఎంతమంది విద్యా ర్థులు హాజరయ్యారనే వివరా లను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.విద్యార్థు లకు ఆంగ్ల మాధ్యమంలో పాఠ్యాంశాలు చెబుతున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలలోని 6, 9వ తరగతులను కలెక్టర్ సందర్శించారు.విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. పాఠశాల ప్రాంగణం లోని మధ్యాహ్న భోజనం వంట గది వద్ద వంటలు కలెక్టర్ పరిశీలిం చారు.అక్కడే ఉన్న అంగ న్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారుల హాజరును పరిశీలించి కేంద్రంలో అంది స్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రంలోని చిన్నారులతో కొద్దిసేపు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ, స్థానిక తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంఈవో రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్