Warangal : వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు జంక్షన్ మినీ కుంటను తలపిస్తోంది. ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రధాన రహదారిపై మురుగు నీరు చేరుతోంది. దీని కారణంగా రోడ్డు లెన్త్ తగ్గి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని, విపరీతంగా దుర్వాసన వస్తోందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.