Tirumala Hotels Closed : అమెరికా – ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కష్టాలు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తగిలింది. గ్యాస్ కష్టాలతో తిరుమలలో ఉన్న టిఫిన్ సెంటర్లు ఇతర హోటళ్లు మూసివేస్తున్నారు. దీంతో భక్తులకు ఆహార సమస్య కొంత ఉత్పన్నమవుతున్న తిరుమల తిరుమతి దేవస్థానం తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం లో లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు మూడు పూటల భోజన వసతి ఏర్పాటు చేసింది. దీంతో హోటళ్లు మూసివేయడంతో వెంగమాంబ అన్నదాన సత్రంకు బారీగా క్యూ కట్టడంతో కిక్కిరిసి పోతున్న అన్నసత్రం. ఇంత అసౌకర్యం ఉన్న భక్తులకు బోజన వసతిలో ఎలాంటి సమస్య లేకుండా స్వామి వారి ఆన్న ప్రసాదం దొరకడంతో భక్తులు ఇబ్బందులు లేకుండా తమ పర్యటన కొనసాగిస్తున్నారు.

