Warangal Temple : శ్రీ కాశి విశ్వేశ్వర ఆలయం ఆకారపు వారి గుడి స్టేషన్ రోడ్డు వరంగల్ వసంత నవరాత్రి ఉత్సవాలు లో భాగంగా ఈరోజు అమ్మవారికి లక్ష గులాబీలతో అర్ర్చించుకోవడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు లంకా శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం అత్యంత వైభవోపేతంగా కనుల పండుగ జరిగింది.. మహిళా భక్తులు లలితా పారాయణం చేశారు. అనంతరం అమ్మవారికి మంగళ నీరాజనాలు భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకారపు హరీష్ స్వాతి దంపతులు, పోలా శార్వాణి నాగలక్ష్మి, పడిశాల సుజాత ,పద్మజ ,సుధామని విజయం మరియు మల్లికార్జున్ సాగర్ సంతోష్ వేణుమాధవ్ మొదలగువారు పాల్గొన్నారు. ఆలయ e.o పి కిషన్ రావు భక్తులకు అన్ని సౌకర్యాలు అందజేశారు.



