Ganapathi Temple : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం నాలుగో రోజు శ్రీ అనఘా మహాలక్ష్మి అమ్మవారు కూష్మాండ అవతారంలో దర్శనం ఇచ్చారు. అమ్మవారికి విశేషార్చనలు, శ్రీ లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలు, చండీ హోమం మహా పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాపాక గోపికిషన్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి దశ విధ హారతులు ఇచ్చారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాతృమండలి సభ్యులు, దేవాలయ ట్రస్ట్ సభ్యులు వామనరావు, డాక్టర్ లక్ష్మినారాయణ, అడ్డగూడి వెంకటేశ్వర్లు, కృష్ణప్రసాద్, బెండల అర్జునరావు, చకిలం ఏకాంబరం, ఓంప్రకాష్, శివకుమార్, డాక్టర్ శార్వాని, యుగేందర్, విజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్