LOC : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64వ డివిజన్ మడికొండ గ్రామానికి చెందిన దువ్వ గణేష్ కి చెవ్వు సమస్య చికిత్స కోసం ప్రభుత్వ ENT కోటి హాస్పిటల్ లో చేరడంతో స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారికి చికిత్స కొరకు 3,50,000 రూపాయల ఎల్ఓసి (LOC) మంజూరు చేయించి ఈ రోజు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండ సుబేదారిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడి తల్లిదండ్రులు లలిత – శ్రీనివాస్ లకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా దువ్వ గణేష్ కి చెవ్వు సమస్య చికిత్స కొరకు ఎల్ఓసి (LOC) మంజూరు చేయించిన ఎమ్మెల్యే నాగరాజుకు వారి కుటుంబ సభ్యులు, నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రఘు చందర్, 64 డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, 46 డివిజన్ అధ్యక్షుడు వస్కుల నాగరాజు, కంటెస్టెడ్ కార్పొరేటర్ బైరి లింగమూర్తి , యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.