Govindarajula temple : వరంగల్ గోవిందరాజుల గుట్ట గోవిందాద్రి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. జేష్ఠ మాసం, జేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. యెన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నగర ప్రజలు ఈ గిరి ప్రదక్షిణ వలన కష్టాలు తీరుతాయని, స్వామి అనుగ్రహం కలుగుతుందని .
వృత్తి, ఉద్యోగ, వివాహ, న్యాయ సంబంధించిన వ్యవహారాల చిక్కులు తొలగుతాయని ప్రతీతి. ఈ స్వామి వారు గుట్ట పై స్వయంభువుగా వెలిసిన గోవిందరాజుల వారు నిత్యము పూజలు అందుకుంటూ కోరిన కోర్కెలు తీర్చుతున్నారు. ఈ గిరి ప్రదక్షిణ మొదలైన సందర్భంగా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గోవిందరాజుల గుట్ట స్వామి వారిని ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు. అర్చక స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదం అందజేశారు.