Govinda raja swamy Temple: చరిత్రకు నిలువైన మన వరంగల్ నగర నడిమధ్యన గోవిందరాజస్వామి కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీదేవి భూదేవి నీలాదేవి సతీ సమీతుండైన శ్రీ గోవిందరాజస్వామి క్షేత్రపాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వరయోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శివనగర్ వాస్తవ్యులు అమ్మిరి శెట్టి బిక్షపతి అమ్మ గారైన కీర్తిశేషులు అమీరిశెట్టి రాజమ్మ జ్ఞాపకార్థం అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు సౌకర్యార్థం భక్తులు కూర్చునే విధంగా సిమెంట్ బల్లాలను రెండు ఏర్పాటు చేయడం జరిగినది. అమీర్ శెట్టి బిక్షపతి, వారి సహోదరులు అమ్మిరి శెట్టి వెంకటేశ్వర్లు. అమీరిశెట్టి రమేష్ వారి నాన్నగారైన అమిరిశెట్టి సదానందం విచ్చేసి భక్తుల సౌకర్యార్థం సిమెంట్ బల్లాలను ఏర్పాటు చేయడం జరిగినది. పై కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి అధ్యక్షులు పెళ్లి సంజీవరావు మరియు D J లడ్డు. శతగోపం అనిల్ లతోపాటు ఆలయ అర్చకులు శ్రీనివాస స్వామి. జగన్నాథం వేణు స్వామి. వరయోగుల కృష్ణమూర్తి. మురళీకృష్ణ. జగన్నాథం రాము లతోపాటు భక్తులు విచ్చేయడం జరిగింది
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్