February 26, 2026

GVBL Team : జీవీబీఎల్ ఆధ్వర్యంలో ఒత్తిడి నిర్వహణపై అవగాహన సదస్సు

GVBL Team : గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్ కాకతీయ చాప్టర్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ జి. రవిచంద్ర ఒత్తిడిని ఎలా జయించాలి అనే అంశంపై సభ్యులకు వివరణాత్మక అవగాహన కల్పించారు. ఆధునిక జీవితంలో ఒత్తిడి సాధారణం, కానీ సరైన వ్యూహాలతో దాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు” అని పేర్కొన్నారు. ఈ సెషన్‌లో ప్రాక్టికల్ టిప్స్, మెడిటేషన్ మెలుకువలు, జీవనశైలి మార్పులు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం బిజినెస్ లీడర్స్ మధ్య మానసిక ఆరోగ్య అవగాహనను పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి చెందిన నూతన డైరీ ని చాప్టర్ చైర్మన్ ప్రభూ కిరణ్, వైస్ చైర్మన్ బొడ్ల రవీంద్రనాథ్, కీర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ముక్క దిలీప్, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ బి అరవింద్, జీవీబీఎస్ సభ్యులు రమేష్ సందీప్ రతీష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *