Task force police : హన్మకొండ జిల్లా హాసనపర్తి మండలంలో పీడిఎస్ బియ్యం డంప్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన పీడిఎస్ బియ్యం పట్టుకొని నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 2,17000 రూపాయల విలువగల 62 క్వింటాల్ల పీడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం హాసన్పర్తి పోలీసులకు నిందితుడుని అప్పగించారు.
