Pushpa Yagam : వరంగల్ నర్సంపేట రోడ్డులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో గురువారం సాయంత్రం పుష్పయాగం నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి విశేషమైన అలంకారం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీత, శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భరత్ కుమార్, ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.

