Warangal Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని ఈ రోజు మధ్యాహ్నం ఇటీవలే విడుదలయిన మోగ్లీచిత్రం హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్ మరియు చిత్రం యూనిట్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్లు చిత్రం పెద్ద హిట్ కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు శ్రీ తానుపునూరి వీరన్న, శ్రీ గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి శ్రీ మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, శ్రీమతి గౌండ్ల, స్రవంతి, శ్రీ అసంతుల శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీ కొంతికుమార్, సిబ్బంది తదితరులున్నారు.

