Bhadrakali Temples : శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈనెల 22వ తారీకు నుండి పది రోజులపాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడు శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్ర మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్, వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్, వరంగల్ అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట రెడ్డి, హనుమకొండ డిఆర్ఓ వైవి గణేష్, కుడా అధికారులు అజిత్ రెడ్డి భీమ్రావులను, దేవాలయ చైర్మన్, ధర్మకర్తల మండలి కార్య నిర్వహణ అధికారి రామల సునీత, భద్రకాళి శేషు, సిబ్బంది ఆహ్వాన పత్రికను అందజేసి నవరాత్రులకు విచ్చేయవలసిందిగా కోరారు.

