Bhadrakali Temple : తెలంగాణా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లీనాయగం, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారుల అభ్యర్ధన మేరకు వరంగల్ నగరానికి విచ్చేసి శ్రీ భద్రకాళీ దేవాలయ మాడవీధుల ప్రగతిని పరిశీలించి తమ సంతృప్తిని వ్యక్తపరిచారు. అనతి కాలంలోనే ఇంత వైభవంగా మాడవీధుల పనిని శరవేగంగా పూర్తిచేస్తున్నందుకు కుడా అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయానికి దక్షిణం వైపు మాడవీధుల నిర్మాణానికి కుడా అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అధికారులు వాటిని ఆమోదించి ఆలయ కార్యనిర్వహణాధికారి ద్వారా శ్రీయుత కమీషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆమోదానికి వెంటనే పంపిస్తామని తెలియజేశారు. స్థపతి వెంట భద్రకాళి శేషు అయ్యగారు, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయకుమార్, కుడా పి.ఓ అజిత్ రెడ్డి, ఈ.ఈ భీంరావు, డి.ఈ.ఈ. రఘుబాబు, ఏ.ఈ.ఈ. వరుణ్, కాంట్రాక్టరు శ్రీధర్ రావు తదితరులున్నారు.
ఈ రోజు ఉదయం వరంగల్ పశ్చిమ ఎం.ఎల్.ఏ శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అమ్మవారి దర్శనం అనంతరం మాడవీధులు పనులను పరిశీలించారు. వీరివెంట కార్పోరేటర్ శ్రీ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, ధర్మకర్తలు శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీమతి సుగుణ, శ్రీమతి మయూరి, శ్రీమతి స్రవంతి, శ్రీ పూర్ణచందర్, శ్రీ సతీష్, శ్రీ ఆంజనేయులు, వెంకటేశ్వర్లు తదితరులున్నారు. ఈ రోజు శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా దేవాలయానికి భక్తులు అమ్మవారి దర్శనమునకు పోటెత్తారు.