August 26, 2025

Kargil Victory Day : యువత దేశభక్తి మరియు జాతీయ భావం కలిగి ఉండాలి…

Kargil Victory Day : కార్గిల్ విజయ దివస్ సందర్భంగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమరులైన జవానులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, విజయంలో కీలక పాత్ర పోషించిన జవాన్లకు వందనాలు తెలిపారు.  కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ భుజంధర్ రెడ్డి విద్యార్థునుద్దేశించి మాట్లాడుతూ 1999లో మేలో జరిగిన లడక్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల వేషంలో ఇండియాలో చొరబడి సియాచిన్ గ్లేసియార్లో నాలుగు ప్రాంతాలను కైవశం చేసుకొని మన సైనికులపై దాడి చేసిన సందర్భంగా 537 మంది జవానులు మరణించారు. సుమారు 1500 జవానులు గాయాల పాలవడం జరిగింది. అయినా కానీ మన వీర సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి మైనస్ సెంటీగ్రేడ్ లో ఉన్న మంచుకొండల్లో యుద్ధం చేసి పాకిస్థాన్ సైనికులను తరిమి కొట్టి విజయం సాధించారు.  కావున యువత దేశభక్తి మరియు సైన్యానికి ఎప్పుడు రుణపడి ఉండాలని సైనికుల సేవలను కొనియాడారు. అలాగే ఎన్ఎస్ఎస్ అధికారి కొడిమాల శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నేటి విద్యార్థుల్లో జాతీయత, దేశభక్తి, సమాజం పట్ల ప్రేమ, మానవత్వం విలువలు తగ్గుతున్నాయని కావున ప్రతి ఒక్కరూ తనతో పాటు దేశాన్ని సమాజాన్ని ప్రేమించాలని ముందు దేశం తర్వాతే అన్ని అనే సిద్ధాంతంతో భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలని ఈ కార్గిల్ పై విజయాన్ని “విజయ దివస్”గా భారత ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. అనంతరం విద్యార్థులచే దేశం పట్ల, సమాజం పట్ల మరియు భారతదేశ అభివృద్ధికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్ అనిత, డాక్టర్ వి శ్రీధర్, ఎస్ సంజీవ సీనియర్ వాలంటీర్లు దేవి శ్రీ ప్రసాద్, క్రాంతి, రాజ్ కుమార్, సాత్విక్, సాకేత్, చిరంజీవి, సాయి హర్షిత్ ,మనమిత ,నవ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *