Sri Rajarajeshwari Temple : వరంగల్ ఎంజీఎం దగ్గర ఉన్న శ్రీరాజరాజేశ్వరిదేవి ఆలయంలో ఆషాఢమాసం శుద్ధ పాడ్యమి నుంచి వైభవంగా శాకాంబరీ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం మొదటి రోజు నవరాత్రుల్లో అమ్మవారికి కామేశ్వరి అవతారంలో అలంకరణ చేశారు. అనంతరం పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.