Bhadrakali temple : వరంగల్ ఇలవేల్పు శ్రీభద్రకాళి ఆలయంలో అమ్మవారికి గురువారం ఉదయం శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కుడా ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి మాతాకీ జై నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్