Warangal Police Commissioner : ప్రతి నిత్యం యోగాసాధన చేస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే పని ఒత్తిళ్ళను అధిగమించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియ జేసారు. ప్రపంచ యోగా దినోత్స వాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిష నరేట్ పోలీస్ అధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన పూర్వీకులు అందించిన యోగాను ప్రపంచ గుర్తింపు రావడంతో పాటు ప్రపంచ యోగా దినోత్సవారన్ని నిర్వ హించుకోవడం భారతీయులుగా మనమందరం గర్వపడాలని, యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంతో మానసికంగా, శారీరకంగా దృఢంగా వుంటామని. అలాగే యోగా అభ్యాసన వలన మన జీవిత కాలాన్ని పోడిగించు కోవచ్చని తెలియజేసారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన యోగా శిక్షకులతో పోలీస్ కమిషనర్‌తో సహా పోలీస్ అధికారులు, సిబ్బంది విధ్యార్థులు ఉత్సహంగా యోగాసాలు సాధన చేసారు. ఈ కార్యక్రమములో డిసిపిలు షేక్ సలీమా,అంకిత్ కుమార్, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్ బోనాల కిషన్, ప్రభాకర్ రావుతో పాటు ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు ఎస్.ఐలు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గోన్నారు.