Grampanchayat opening : పర్వతగిరి మండల పరిధిలోని సోమారం గ్రామం నందు సుమారు 25 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.
తొలుత ఎమ్మెల్యే నాగరాజుకు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికిన గ్రామపంచాయతీ అధికారులు సిబ్బంది. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు సెక్రెటరీని కుర్చీలో కూర్చోబెట్టి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.