February 27, 2026

Hanumakonda District : నూతన కలెక్టర్ గా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన.. చాహత్ బాజ్ పాయ్

Hanumakonda District : హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా చాహత్ బాజ్ పాయ్ గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. జిల్లా కలెక్టర్ గా నూతనం గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ ను కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కన్నం నారాయణ, పలువురు జిల్లా అధికారులు, తహసిల్దార్లు నూతన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియ జేశారు. బాధ్యతలు స్వీకరిం చేందుకు కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కి అదనపు కలెక్టర్, అధికారులు ఘనంగా స్వాగతం పలికి పూల మొక్కలు పుష్ప గుచ్చాలను అందించారు. జిల్లా కలెక్టర్ గా కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ గా పని చేసిన స్నేహ శబరిష్ బదిలీపై మహబూబాబాద్ జిల్లాకు కలెక్టర్ గా వెళ్ళగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న చాహత్ బాజ్ పాయ్ హనుమకొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *