environmental protection : వన మహోత్సవం సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మొక్కలు నాటారు. వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రాంగణంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా వరంగల్ పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ – “పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారం. మన ఆరోగ్యవంతమైన భవిష్య త్తుకు పచ్చదనం అత్యవసరం. రోజురోజుకీ పెరిగే కాలుష్యం, అసమయ వర్షాలు, విపరీత మైన ఎండలు మన జీవితా లకు ముప్పుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వన మహోత్సవం వంటి కార్యక్ర మాలు ప్రజల్లో మౌలికంగా అవగాహన పెంచే అవకాశంగా మారాలి,” అని పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవానికి ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు చేపట్టిం దని తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా నగరంలో విరివిగా మొక్కలు నాటలని పిలుపు నిచ్చారు.
అనంతరం కళాశాల భవనాన్ని కలియ తిరిగి పరిశీలించారు.తమ కళాశా లలకు రోడ్డు, మరుగుదొడ్లు, సెమినార్ హాల్ పునరుద్ధణ పలు అంశా లను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు పనులన్నింటికి అంచనాలు వేసి నివేదికలు పంపించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ వి శ్రీనివాస్ రావు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.