OOKAL TEMPLE : వరంగల్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న గీసుకొండ మండలంలోని ఊకల్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం పంచామృతాలతో విశేషమైన అభిషేకాలు చేశారు. ఈ దేవాలయానికి ప్రతి మంగళవారం వేలాది మంది తరలి వస్తుంటారు. సంతానం లేని దంపతులకు ఇక్కడి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటే సంతానం కలుగుతుందని ప్రతితీ. దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సుదర్శనశర్మ స్వామి వారికి నిత్య పూజలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు అర్చకులు అర్చనలు చేసి తీర్థప్రసాదాలు అందచేశారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్