February 26, 2026

Times Higher Education : ర్యాంకింగ్స్‌లో SR యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు

Times Higher Education : వరంగల్‌లోని SR యూనివర్సిటీ (SRU) టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్–2026లో విశేష ఘనత సాధించింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో గ్లోబల్ ర్యాంక్ 601–800, జాతీయ ర్యాంక్ 21, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో గ్లోబల్ ర్యాంక్ 601–800, జాతీయ ర్యాంక్ 18ను సాధించింది. ఈ ర్యాంకింగ్స్‌ను ఈ నెల 21న విడుదల చేశారు. ఇంతకుముందు SR యూనివర్సిటీ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2026లో గ్లోబల్ ర్యాంక్ 801–1000, జాతీయ ర్యాంక్ 28ను పొందింది. ఈ ఘనతతో దేశంలో గ్లోబల్ ర్యాంక్ సాధించిన అతి పిన్న వయసు విశ్వవిద్యాలయాల్లో SRU ఒకటిగా నిలిచింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను బోధన, పరిశోధన, సైటేషన్లు, అంతర్జాతీయ దృష్టికోణం, పరిశ్రమ ఆదాయం వంటి ఐదు ప్రధాన ప్రమాణాల ఆధారంగా అంచనా వేసే అత్యంత విశ్వసనీయ ర్యాంకింగ్స్‌గా గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా SR యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ ఏ. వరదా రెడ్డి మాట్లాడుతూ, నాణ్యమైన విద్య, నైపుణ్యాధారిత బోధన, అధ్యాపకుల అభివృద్ధి మరియు ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, కోర్ ఇంజినీరింగ్ రంగాల్లో జరుగుతున్న ప్రభావవంతమైన పరిశోధనల ఫలితంగానే ఈ ర్యాంకింగ్ సాధ్యమైందన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ, అకడమిక్స్, పరిశోధన, మౌలిక వసతులు మరియు గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా SR యూనివర్సిటీ సాధిస్తున్న నిరంతర పురోగతికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. అంతర్జాతీయ అనుభవం కలిగిన అధ్యాపకులు, ఆధునిక సదుపాయాలు, బలమైన పరిశోధనా సంస్కృతి ఈ విజయానికి ప్రధాన కారణాలన్నారు. SR యూనివర్సిటీలో వ్యవసాయం, బిజినెస్, కంప్యూటర్ సైన్స్ & AI, ఇంజినీరింగ్, సైన్సెస్ & హ్యూమానిటీస్ అనే ఐదు స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు 6,000కు పైగా WoS/Scopus ఇండెక్స్ఎడ్ పరిశోధనా ప్రచురణలు, 800కు పైగా Q1 పేపర్లు, 1,500కు పైగా పేటెంట్ ప్రచురణలు,95 పేటెంట్ మంజూర్లు, ₹10 కోట్లకు పైగా పరిశోధనా నిధులు సాధించింది. SR ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ (SRiX) ద్వారా 170కు పైగా స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం అందిస్తోంది.150కు పైగా రిక్రూటింగ్ కంపెనీలతో పాటు, మైక్రోసాఫ్ట్ నుండి ₹51 లక్షల వార్షిక ప్యాకేజ్ వంటి అత్యున్నత ప్లేస్‌మెంట్‌ను SRU సాధించింది. ఈ గ్లోబల్ గుర్తింపు ద్వారా నాణ్యమైన ఉన్నత విద్యలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఎదుగుతున్నదానికి SR యూనివర్సిటీ మరో ఉదాహరణగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *