C.M.Revanth Reddy : నా జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక్క – సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం నాకు లభించిన రోజు ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా, సహచర మంత్రుల సమేతంగా వనదేవతలు, జన దేవతలైన సమ్మక్క – సారలమ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సందర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకం.


