Brahma Kamalam : హిమాలయాలలో కనిపించే అరుదైన బ్రహ్మాకమలాలు కనువిందు చేశాయి. హన్మకొండలోని రెడ్డికాలనీకి చెందిన పగడాలకాశి ప్రసాదరావు-సాగరిక దంపతుల ఇంట్లో ఈ అరుదైన పుష్పాలు వికసించాయి. నాలుగు సంవత్సరాల క్రితం మొక్కను తీసుకొచ్చి నాటారు. శుక్రవారం రాత్రి తొలిసారిగా వికసించాయి. దీంతో చుట్టుపక్కల వారు తరలివచ్చి పుష్పాలను వీక్షిస్తున్నారు. మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైన పుష్పం.