⇒ చెట్లతోనే పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు… ప్రొఫెసర్ నారాయణ కేయూఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్.
environmental pollution : వన మహోత్సవం పురస్కరించుకుని ఏవివి జూనియర్ కళాశాలలో లో మంగళవారం చెట్లు నాటే కార్యక్రమం యన్ఎస్ఎస్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ గారు చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగము సమాజ రుగ్మతలపై ముఖ్యంగా పర్యావరణహితమైన కార్యక్రమంలో చేయుటలో ముందు ఉంటదని అందులో భాగంగానే ఈరోజు ఏవీవీ ప్రాంగణంలో సుమారు 20 మొక్కలను నాటడం జరిగినది చెట్లను నాటడం వల్ల ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని ఇతర కాలుష్యాల నుండి బావి తరాలను కాపాడిన వాళ్లము అవుతామని ముఖ్యంగా భూతాపం నుండి ప్రజలను కాపాడవచ్చని మరియు వాతావరణ మార్పులు వాన కాలంలో ఎండలు కొట్టడం, ఎండాకాలంలో వానలు వానలు పడడం చలికాలంలో ఎండలు కొట్టడం రకరకాల వాతావరణంలో నీ మార్పులను ఈ చెట్లు పెంచడం ద్వారా నియంత్రించవచ్చని కావున ప్రతి ఒక్కరు ఒక సందర్భానుసారంగా బర్త్డే కావచ్చు ,మ్యారేజ్ డే కావచ్చు, ఏదైనా ఒక రోజు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటే ఒక మంచి అలవాటు నేర్చుకొని పచ్చని తెలంగాణను మంచి వాతావరణాన్ని భావితరాల వారికి అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల పై ఉన్నదని అన్నారు . కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భుజంగ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ పై ఏవివిఎన్ఎస్ఎస్ విభాగము ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ముఖ్యంగా సింగిల్ ఇస్ ప్లాస్టిక్ నిషేధంపై” ప్లాస్టిక్ వద్దు పర్యావరణము ము ద్దు :అనే స్లోగంతో ముందుకు వెళ్తున్నామని అలాగే పర్యావరణంలో భాగంగా చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఇది పర్యావరణానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిత, డాక్టర్ శ్రీధర్, చండీశ్వర్, జి శ్రీనివాస్, డిగ్రీ కాలేజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి శ్రీనివాస్ ,సీనియర్ వాలంటీర్లు మన్మిత ,చందన, స్వాతి ,మినిమం, స్వాతి, మీన్ను, దేవిశ్రీప్రసాద్, సాయి హర్షిత్, రాజ్ కుమార్ ,చిరంజీవి, భరత్ తదితరులు పాల్గొన్నారు.