Rewuri Prakash Reddy : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవడానికి యోగా అమూల్యమైన సాధనమని అన్నారు. మన దైనందిన జీవితంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుంది తెలిపారు. యోగ శరీరం, మనస్సు, ఆత్మకు మధ్య సమతుల్యతను సాధించే ప్రాచీన భారతీయ సంప్రదాయ విధానమని అన్నారు. యోగాను ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు అని నేను బలంగా నమ్ముతున్నాను అన్నారు. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని అన్నారు. అనంతరం యోగా నిర్వాహకులను ఎమ్మెల్యే గారు శాలువాతో ఘనంగా సన్మానించారు.