Kakatiya physiotherapy college : ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఫిజియోథెరపీ వైద్య విధానం ఆధునిక వైద్యంలో కీలక పాత్ర పోషిస్తుందని ,వృద్ధాప్య సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, న్యూరోలాజికల్ సమస్యలు, శస్త్రచికిత్సల తరువాత కోలుకునే దశలో ఫిజియోథెరపీ అనేది ఎంతో ఉపయోగకరమైన వైద్యమార్గం అని అన్నారు. వరంగల్ నగరంలో అత్యాధునికంగా నిర్మించబోయే ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫిజియోథెరపీ విభాగానికి ప్రాధాన్యత కల్పిస్తమని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. నిపుణులైన ఫిజియోథెరపిస్టుల సేవలను ప్రభుత్వ స్థాయిలో మరింత విస్తరిస్తాం అని తెలిపారు.
ప్రభుత్వం వైద్య రంగ అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారించిందని, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే వివరించారు. ఫిజియోథెరపీ విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ సేవలందిస్తూ రాష్ట్ర ఆరోగ్య రంగాన్ని మరింత శక్తివంతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారితో సరదాగా మమేకమైన ఎమ్మెల్యే గారు వార్షికోత్సవ వేడుకలను స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఫిజియోతెరపిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు పెరుమాండ్ల రామకృష్ణ,డైరెక్టర్ లు డాక్టర్ బి ఎస్ రెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి,కాకతీయ కాలేజ్ అఫ్ ఫిజియోథెరపీ సభ్యలు, వైద్యులు పాల్గొన్నారు.