Regional Sports : హనుమకొండ జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రాంతీయ క్రీడల హాస్టల్ ఎంపికలు బుధవారం విజయవంతంగా ముగిశాయి. ఈ ఎంపికల్లో జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, ఈత తదితర విభాగాల్లో పోటీలను నిర్వహించారు. జిల్లా యువజన మరియు క్రీడాధికారి గుగులోతు అశోక్ కుమార్ ఈ ఎంపికలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చూపించిన ప్రతిభ అభినందనీయమని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు త్వరలో వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో SAT పరిశీలకులు డా. రవికుమార్, నర్సింహారావు, స్వర్ణలత, సంతోష్, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. కరీం, ఎస్ ఏ టి అసోసియేషన్ సంయుక్త జిల్లా కార్యదర్శి స్వామి చరణ్, జిల్లా క్రీడాశిక్షకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.