CP sunpreet sing : బక్రీద్ పర్వదిగాని పురస్కరించుకొని హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఈద్గా వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ పరిశీలించడంతో పాటు బక్రీద్ పండుగ ప్రార్ధనలు ప్రశాంతంగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ కమిషనర్ వెంట హన్మకొండ ఏసీపీ నర్సింహా రావు, ఇన్స్ స్పెక్టర్ సతీష్, సీతారెడ్డి వున్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్