టీచర్స్ కాలనీ ప్రవేశ ద్వారం (ఆర్చ్) నిర్మాణానికి భూమిపూజ..
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని..
శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు..
MLA rajendhar reddy : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 60 వ డివిజన్ వడ్డేపల్లి టీచర్స్ కాలనీలో ఫేస్-2 లో స్థానిక కాలనీవా సుల ఆధ్వర్యంలో నిర్వహించిన కాలనీ ప్రవేశ ద్వారం (అర్చ్) నిర్మాణ భూమి పూజ కార్య క్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు మీరు చేస్తున్న ఈ కార్య క్రమం చిన్న విషయం కాదని ఇది మీ కాలనీకి ఒక గుర్తింపు, ఒక గౌరవ సూచకంగా, ఒక అభివృద్ధి చిహ్నంగా పరిగ ణించబడు తుందని ఒక్క ప్రవేశ ద్వారం కడతాం అనగానే అందులో ఎన్నో భావాలు, ఆశలు, కలలు నిండి ఉంటా యన్నారు. అర్చ్ అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని అది మీ కాలనీ ఐక్యతకు
అభివృద్ధి దిశగా వేసే తొలి అడుగని కొనియాడారు. ఈ కార్యక్రమం వీలయ్యేలా సహకరించిన కాలనీ వాసులకు, కార్యదర్శులకు, యువతకు మరియు స్థానిక నాయకు లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని అభినందనలు తెలియజేశారు. నేను ఎమ్మెల్యే గా పనిచేస్తున్న రోజులన్నీ ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు నడుస్తానని ఇదే ఆదర్శంతో, ప్రతి కాలనీకి మౌలిక వసతు లు, రహదా రులు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ – అన్నీ మెరుగుపర్చే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ అర్చ్ నిర్మాణం కాలనీ అభివృద్ధికి మరింత వెలుగు తీసుకొచ్చేలా మారాలని ఆకాంక్షించారు.
అనంతరం స్థానికంగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు,పాలక మండలి సభ్యులు,కాలనీ వాసులు ఎమ్మెల్యే ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్ర తినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు ఉన్నారు.