బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే …
Mla kadiyam srihari : చిల్పూర్ మండలం నష్కల్ గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ దేవతల కృపా కటాక్షాలు గ్రామ ప్రజలపై ఉండాలని, గ్రామస్తు లందరూ సుఖ సంతో షాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అంతకు ముందు హన్మకొండలోని ఎస్ వి కన్వెన్షన్ నందు జరిగిన జఫర్గడ్ మండలం తిడుగు గ్రామ వాస్తవ్యులు బజ్జురి రవి కుమార్తె వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.