Police commissioner : పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పదవీవిరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సుధీర్ఘ కాలం పనిచేసి పదవీవిరమణ చేసిన పోలీస్ అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ సొమవారం ఘనంగా సత్క రించి జ్ఞాపికలను అందజేసారు. పదవీ విరమణ పొందిన వారిలో డిసిపి జనార్థన్, ఎస్.ఐలు ఆలీ మహమ్మద్, అఫ్జల్‌పాషా,రాజీరెడ్డి,పురుషోత్తం,మహేందర్ రావు, క్రిస్టాచారి,యాకూబ్ అలీ, ఏఎస్‌ఐ భీంరాజు, హెడ్ కానిస్టేబుల్ రమేష్,గుప్తా, కానిస్టేబుల్ కొండయ్య వున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మీ సేవలు నేటి తరం పోలీసులకు అదర్శంగా నిలుస్తుందని, నేటి ఈ ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని, మీ అందించిన సేవలు మరువమని పోలీస్ కమిషనర్ తెలిపారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ