Temple : హై కోర్టు న్యాయమూర్తి సుజాన అమ్మవారిని కుటుంబ సమేతంగా ఈరోజు దర్శించుకున్నారు. ముందుగా ఆలయ ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు శేషు న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అనంతరం గణపతిని దర్షింపజేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.