July 25, 2026

Venkateshwara : ఏకాదశి సందర్భంగా లడ్డూ ప్రసాద ఉచిత వితరణ.

Venkateshwara : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రీతి పాత్రమైన లడ్డూ ప్రసాద ఉచిత వితరణ ఈ ఏకాదశి రోజు నా చేతులమీదుగా చేయడం ఆనందంగా ఉందని మాజీ కార్పొరేటర్ గందె కల్పన నవీన్ అన్నారు. శ్రీ శ్రీనివాస పద్మావతీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యం లో శనివారం ఏకాదశి సందర్భంగా గీతా భవన్ దేవాలయం లో ఉచిత లడ్డూ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కల్పన నవీన్ ప్రారంభించారు. ఈ ట్రస్ట్ లో తాను కూడా ఒక సభ్యురాలు కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఏకాదశి రోజున గీతా భవన్ లో, సెకండ్ బ్యాంకు కాలనీ బాలాజీ టెంపుల్ లో,టీచర్స్ కాలనీ వెంకటేశ్వరాలయం లో, ఎల్లమ్మ బజార్ లోని కొత్తగుడి, రామానుజ కూటం లో, బట్టల బజార్ లోని బాల నగర వెంకటేశ్వర ఆలయం బయట సుమారు 3000 లడ్డూలను పంపిణీ చేయడం జరిగింది. ట్రస్ట్ ఆధ్వర్యం లో గోవింద రాజుల గుట్ట వద్ద గిరి ప్రదక్షణ సమయం లో లడ్డూ ప్రసాద వితరణ తో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *