Fertility Care : భారత దేశంలో సంతాన సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయుటకు ఒయాసిస్ అకాడమీ ఆధ్వర్యంలో జనని డైలాగ్స్ కార్యక్రమమును నిర్వహించింది. సంతానోత్పత్తికి ఆరోగ్యం, ముందస్తు అవగాహన సమాచారంతో కూడిన కుటుంబ నిర్మాణంపై ప్రజలకు అవగాహనా కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికి అందుబాటులోకి వచ్చింది. ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్ డాక్టర్ జలగం కావ్యారావు మాట్లాడుతూ ప్రారంభ దశలోనే సంతాన సాఫల్యంపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఒయాసిస్ అకాడమీ కార్యక్రమాల ద్వారా కుటుంబాలకు మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్య ఫలితాలను అందించటంతో పాటు ఆరోగ్య సంరక్షణ, సామర్ధ్యాన్ని కూడా బలోపేతం చేయగలమని తెలిపారు.
ఇటీవలి కాలంలో నగరాలు, జిల్లా కేంద్రాలు మాత్రమే కాకుండా రెండో స్థాయి పట్టణాల్లో కూడా సంతాన సాఫల్యం పెరుగుదల వెనుక వైద్య, సామాజిక, ఆర్థిక, జీవితశైలి కారణాలు కలిసి పనిచేస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆలస్యమైన వివాహాలు ఆధునిక జీవనశైలి కారణంగా ఒత్తిడి, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, రాత్రి పూట పనులు వంటి అంశాలు సంతాన సాఫల్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. చదువు, కెరీర్ ప్రాధాన్యం పెరగడంతో అబ్బాయిలు–అమ్మాయిలు ఇద్దరూ ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు పిల్లల్ని ఆలస్యంగా ప్లాన్ చేస్తున్నారు.
వయసు పెరిగే కొద్దీ సహజ గర్భధారణ అవకాశం తగ్గుతుండటంతో, వైద్య సహాయం కోసం ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించే జంటల సంఖ్య పెరుగుతోంది. మహిళా, పురుషుల్లో వంధ్యత్వ సమస్యల పెరుగుదల, పీసీఓడీ, థైరాయిడ్, ఎండోమెట్రియోసిస్, ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్, క్రానిక్ అనోవ్యులేషన్ వంటి సమస్యలు మహిళల్లో పెరుగుతున్నాయి. ఇవి గర్భధారణను అడ్డుకుంటున్నాయి. స్పెర్మ్ కౌంట్ తగ్గడం, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మద్యం–ధూమపానం అలవాట్లు పురుషుల వంధ్యత్వాన్ని కూడా పెంచుతున్నాయి. స్త్రీ–పురుషులకు రెండింటికీ వైద్య పరీక్షలు, ట్రీట్మెంట్ అవసరం అయ్యే పరిస్థితుల్లో మల్టీడిసిప్లినరీ టీమ్ ఉన్న ఫెర్టిలిటీ ఆసుపత్రులు కీలక భూమిక పోషిస్తున్నాయి.
భారతదేశ వ్యాప్తంగా ఒయాసిస్ అకాడమీ కుటుంబాలకు మెరుగైన పునరుత్పత్తి, ఆరోగ్య ఫలితాలను అందించటంతో పాటు ఆరోగ్య సంరక్షణ, సామర్ధ్యాన్ని కుటుంభ నిర్మాణంలో అవగాహన, సేవల లభ్యత, స్తోమతను మెరుగుపర్చడం ద్వారా జనని డైలాగ్స్ను ముందుకు తీసుకు వెళ్ళడానికి ఒయాసిస్ ఫలిటీ నిబద్ధతను పునరుద్గాటించింది.


