Datta Kshetram : వరంగల్ ములుగు రోడ్డు దత్త క్షేత్రంలో శుక్రవారం ఉదయం ఆశ్రమంలో నూతనంగా నిర్మించబోవు శ్రీ గణపతి సచ్చిదానంద సభా మండపం శంకుస్థాపన, నిర్మాణం పనులు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎమ్మెల్యే, మేయర్, మైసూర్ పీఠం నుంచి వచ్చిన పండితులు బ్రహ్మశ్రీ కళ్యాణ్ శర్మ, ఎస్జీఎస్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మైసూరు అవధూత దత్త పీఠం బ్రహ్మశ్రీ కళ్యాణ్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ హనుమత్ హోమం, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి మూలమూర్తి ప్రతిష్ట, హోమం పూర్ణాహుతి, మహా మంగళ హారతులు నిర్వహించారు. అనంతరం ఎస్జిఎస్ దత్త జ్ఞాన బోధ సభ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
