Minister Konda Sureka : వరంగల్ నగరంలోని ఇస్లామీయ కళాశాల గ్రౌండ్ లో గురువారం రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ చేతులమీదుగా ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం వృత్తి ఉద్యోగాలతో సతమతమౌతూ ఒత్తిడికి గురైయ్యెవాళ్ళు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందడానికి ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తీర్చి దిద్దిన విమానం సెట్టింగ్ ను స్వాగత ద్వారం గా చాలా బాగా ఆకట్టుకుంటుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులను అభినందించారు. ముఖ్యంగా పిల్లలకు ప్రత్యేకంగా విజ్ఞానము వినోదాన్ని పంచే ఐటమ్స్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచనలు అందజేస్తూ ఈ విషయం పై జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడుతానని ఆమె అన్నారు. నిర్వాహకులు అస్లాం మాట్లాడుతూ వరంగల్ నగర ప్రజలకు వినోదం ఉల్లాసం ఉత్సాహాన్ని అందించడానికి బారీ సెట్టింగ్ లతో విమానం ప్రధాన ముఖద్వారంగానే కాకుండా దుబాయ్ మరియు ఇతర దేశాల్లో పర్యటించిన అనుభూతి కలిగించే సెట్టింగులను ఎంతో ఆకర్షనీయంగా ఏర్పాటు చేశామని చెప్పారు, అలాగే దేశంలోని నలుమూలల నుండి వచ్చిన వివిధ రకాల చేతివృత్తుల కలంకారీ వస్తువులు, స్త్రీ అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు, పిల్లలకు బొమ్మలు మరియు ఇతర రకరకాల100కు పైగా స్టాల్ల్స్ ఏర్పాటు చేశామని, పిల్లలను పెద్దలను ఉల్లాసం ఉత్సాహం పరిచే ఇటాలియన్ టైప్ బారీ అమ్యూజ్మెంట్ పార్క్ లో రెంజర్, జైంట్ వీలు తదితర అనేక ఐటమ్స్ ఏర్పాటు చేశామని అంతేకాక నోరూరించే డిల్లీ పాపడ్, సిమ్లా మిర్చి, కలకత్తా చాట్ బండార్ మరియు శీతల పానీయాలు ఐస్క్రీమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు , ఈ ఎగ్జిబిషన్ ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని అస్లాం చెప్పారు, ఈకార్యక్రమానికి నిర్వాహకులు శ్రీ కాంత్, మీర్జా రఫీక్ బేగ్ మేనేజర్లు ఫిరోజ్, డేవిడ్, శ్రీ పాల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు పోలీసు అధికారులు తదితరులు హాజరైయ్యారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్