Warangal Temple : వరంగల్ పశ్చిమ నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మరియు మంత్రి శ్రీమతి కొండా సరేఖ గారి ఆదేశముల మేరకు భద్రకాళీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వయా భద్రకాళీ దేవస్థానం మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్ వరకు టి.జి.ఎస్.ఆర్.టి.సి బస్సు నడుపుటకు నిర్ణయించి కొత్త బస్సును ఈ రోజు ఉదయం లాంఛనంగా టి.పి.సి.సి వైస్ ప్రెసిడెంట్ శ్రీ బత్తిని శ్రీనివాస్ రావు (బట్టి శ్రీను) జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ శ్రీ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, దేవాలయ చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు శ్రీ తొనుపునూరి వీరన్న, శ్రీ గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీమతి గాండ్ల స్రవంతి, శ్రీమతి మోతుకూరి మయూరిరామేశ్వర్రావు, శ్రీ ఓరుగంటి పూర్ణచందర్, శ్రీ బింగి సతీష్, కార్యనిర్వహణాధికారి శ్రీమతి రామల సునీత, భద్రకాళి శేషు అయ్యగారు దేవాలయ అర్చకులు మరియు సిబ్బంది, ఆర్.టి.సి హనుమకొండ డిపో మేనేజరు ధరమ్ సింగ్, శ్రీ శ్రీనివాస్ తదితరులున్నారు.