⇒ గీసుగొండలో మాజీ మంత్రి హరీష్ రావు..
⇒ పార్టీ శ్రేణులతో సమావేశం..
⇒ వినాయక చవితి తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు..
⇒ సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన..
⇒ ఎరువులు అందివ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్దిచెప్పడానికి రైతులు సిద్ధం..
Tanniru Harish Rao : స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో మాజీ జెడ్పీటీసీ పోలీస్ ధర్మారావు నివాసంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారితో కలిసి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎరువుల కొరతపై, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడగగా.. సరైన సమయంలో పంటలకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్ళివ్వక.. కావాల్సిన ఎరువులు అందివ్వక పోవడం వల్ల సొసైటీలలో కూర్చోలేక పోతున్నామని సొసైటీ చైర్మన్లు హరీష్ రావు గారికి తెలియచేశారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే కరువని.. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. రైతులకు అప్పుడు ఇప్పుడు అండగా బిఆర్ఎస్ ఉంటుందని తెలిపారు. వచ్చే వినాయక చవితి తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఉందని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తిప్పికొట్టాలని యువతకు సూచించారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.