Har Ghar Tiranga Rally: “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమంలో భాగంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కోడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారత జాతీయ ప్రతాకాన్ని చేతబట్టి కళాశాల నుండి ఎంజిఎం వరకు భారతదేశ పై భక్తిశ్రద్ధలు, దేశభక్తి పెంపొందించేలా యువతకు, ప్రజలకు ప్రేరణ కల్పిస్తూ పెద్ద ఎత్తున జాతీయ భావన నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అండ్ ఎన్ఎస్ఎస్ అధికారి మాట్లాడుతూ నేటి యువత వినోదము, ఆనందంపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ దేశము పట్ల సమాజం పట్ల నిర్లక్ష్యంగానే ఉంటున్నారని చెప్పవచ్చు. కావున రేపటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువతలో జాతీయ భావము మరియు దేశభక్తి ,సైనికుల త్యాగాలను గుర్తుచేస్తూ దేశం పట్ల విధేయతగా ఉండే విధంగా ఈ తీరంగా ర్యాలీని నిర్వహించడం జరిగిందని అన్నారు .ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎస్.అనిత, డాక్టర్ శ్రీధర్, కళాబృందం సభ్యులు చిరంజీవి, రమేష్ ,శివ మరియు సీనియర్ వాలంటీర్లు సాత్విక్ ,దేవిశ్రీప్రసాద్, క్రాంతి, సాకేత్, చిరంజీవి, దస్తగిరి, సాయి హర్షిత్, సాదియాఫర్హిన్ , షాజహాన్ మహీన్ ,సన, మన్విత, తదితరులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్