District Collector Dr. Satya Sharada : వరంగల్, 1 మే 2025. వేసవి ఉచిత క్రీడా శిబిరాలను చిన్నారులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జిల్లా యువజన, క్రీడాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలను గురువారం జిల్లా కేంద్రంలోని ఓ సిటీ స్టేడియంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు తమకు నచ్చిన క్రీడా అంశాన్ని ఎంపిక చేసుకొని అందులో రాణించాలన్నారు. మే 1 నుండి జూన్ 6 వరకు జరిగే వివిధ క్రీడా అంశాల్లో కోచ్‌లు, సీనియర్ క్రీడాకారులు పర్యవేక్ష ణలో మెలకువలు నేర్చుకొని ఆటలో రాణించాలన్నారు. అనంతరం శిబిరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 10 గ్రామీణ ప్రాంతాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నేటి నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడా శిక్షణలతో పాటుగా అర్బన్ (పట్టణ) ప్రాంతాలకు సంబంధించిన పిల్లలను కూడా క్రీడారంగంలో ప్రవేశం కల్పించి అటు శారీరకంగా ఇటు మానసికంగా దృఢంగా ఉండేలా తయారు కావాలనే ఉద్దేశంతో స్థానిక ఓ సిటీ స్టేడియంలో ఒలంపిక్‌లో గుర్తింపు ఉన్న ఖోఖో, క్రికెట్ మరియు జూడో క్రీడా అంశాల్లో కోచ్‌లు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు.తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని, క్రీడల ద్వారా కలిగే ప్రయోజనాలు , ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ అన్నారు. వేసవి సెలవులలో ఉన్న సమయాన్ని సక్రమమైన ప్రణాళికతో క్రీడలలో చేరాలన్నారు.ఈ సందర్భంగా అర్బన్ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల శిక్షకులకు క్రీడా సామగ్రిని జిల్లా కలెక్టర్ గారి చేతుల అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా యువజన క్రీడల అధికారి సత్య వాణి, తహసీల్దార్ ఇక్బాల్, ఒలంపిక్ అసోసియేషన్ సెక్రటరీ కైలాష్ యాదవ్,ఓయాసిస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పరంజ్యోతి , జెఎన్టియు స్పోర్ట్స్ బోర్డ్ కన్వీనర్ దిలీప్ జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ సంజీవ్ , క్రీడాకారులు తల్లిదండ్రులు వాకర్స్ పాల్గొన్నారు.