July 13, 2026

Govt school : వడ్డేపల్లి హనుమకొండ లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు

Govt school : ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వడ్డేపల్లి హనుమకొండ లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సదస్సు జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందగట్ల సురేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కవిత గారు మాట్లాడుతూ బాలల హక్కుల గురించి అలాగే బాల్య వివాహాలు చేయకుండా ఎలా ఆపాలి దీనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1098 మరియు 15100 విశిష్టతను తెలిపి మీ కుటుంబంలో గాని సమాజంలో గాని నిరోధించాలని తెలిపారు. ఆ తర్వాత అడ్వకేట్ రవి గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో సూచించిన విధంగా మన హక్కులతో పాటు బాధ్యతలు కూడా నిర్వహించాలని మీరందరూ ఉత్తమ భావి భారత పౌరులుగా బాధ ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిగతా అడ్వకేట్లు మరియు పాఠశాల ఉపాధ్యాయులు కృష్ణవేణి రాజగోపాల చారి మోహన్ రెడ్డి విమల భాయి ఉమారాణి అనూష మరియు చాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *