Voter’s Day : 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య కార్యక్రమం మరియు వకృత్వ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ గారు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 18 సం. ల వయసు పూర్తయిన వయోజనులు నూతన ఓటర్లుగా నమోదవడానికి కృషి చేయాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం నాడు వరంగల్ నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాల మరియు శ్రీమేధ జూనియర్ కళాశాలల్లో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ పోటీలను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం పలు కళాశాలల్లో వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో విద్యార్థుల ఆలోచనలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సం. జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లను సన్మానించడం. ఎపిక్ కార్డుల జారీ, ప్రతిజ్ఞ నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను సర్టిఫికేట్లు, బహుమతులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాళ్ల ఎస్. సంజీవ, వీరన్న, ఎన్నెస్సెస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస రావు, బరుపాటి గోపి ,డాక్టర్ శ్రీధర్ తదితర అధ్యాపకులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్
