Parakala Municipality : పరకాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీలో సానిటేషన్ పనులు చేపిస్తున్న మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్. మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా ఇంటింటి చెత్త స్వచ్ఛ ఆటోల ద్వారా క్రమం తప్పకుండా సేకరించాలని, వీధులలోని చెత్త ట్రాక్టర్ల ద్వారా క్రమం తప్పకుండా సేకరించాలని, దుర్వాసన వస్తున్న పరిసర ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల మందు పాగింగ్ చేపించాలని, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు తీపించాలని, డ్రైనేజీలు తీసిన చెత్త కుప్పలు వెంటవెంటనే తీపించాలని, వార్డులో కోతుల, కుక్కల బెడద ఉందని చర్యలు తీసుకోవాలని, వార్డులోని ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జీవించేలా చూడాలని కమిషనర్ గారిని మాజీ కౌన్సిలర్ కోరినారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వార్డులోని ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, వ్యక్తిగత శుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసినారు. ఈ కార్యక్రమంలో వార్డులోని పెద్దలు, యువకులు మడికొండ ఐలయ్య, ఇమ్మానియేల్, పాలకుర్తి భాస్కర్, జవాన్ మంద. మహేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ