Bhdrakali Temple : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీయుత కమీషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశముల మేరకు దేవాలయ ప్రాంగణంలో 50 రకాల పూలు మరియు పండ్ల మొక్కలు నాటుట జరిగినది. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డా॥ బి. శివసుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు శ్రీ తానుపునూరి వీరన్న, శ్రీ ఓరుగంటి పూర్ణచందర్, శ్రీ బింగ్ సతీష్, శ్రీ పాలడుగుల ఆంజనేయులు, శ్రీ జారతి వెంకటేశ్వర్లు, శ్రీ అనంతుల శ్రీనివాస్ రావు, దేవాదాలయ కార్యనిర్వహణాధికారి & సహాయ కమీషనర్ శ్రీమతి రామల సునీత, భద్రకాళి శేషు అయ్యగారు, పర్యవేక్షకులు శ్రీ విజయకుమార్, కృష్ణ, శ్యామ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
జనరల్ / తాజా వార్తలు / తెలంగాణ / లోకల్ న్యూస్