Publish with kindness : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన ర్యాలీ కె ఎం సి నుండి ఎంజీఎం హాస్పిటల్ కూడలి వరకు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద గారు మాట్లాడుతూ ప్రజలందరూ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకొని హెచ్ఐవి బారిన పడకుండా ఉండాలని ఎవరైనా బాధితులు కనుక ఉంటే మంచి ఆహారా అలవాట్లతో , పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో అందిస్తున్న రిట్రో వైరల్ ARTతెరఫీ మందులతో హ్యాపీగా బతకచ్చని అన్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ పై గత 20 సంవత్సరాలుగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొడిమాల శ్రీనివాసరావు ( స్టేట్స్ రిసోర్స్ పర్సన్ రెడ్ రిబ్బన్ క్లబ్స్ మరియు యూత్ పర్ సొసైటీ ) రూపొందించిన 87 ఫీట్ల రెడ్ రిబ్బన్ మరియు రక్త బిందువు, ఎయిడ్స్ సింబల్సతో ర్యాలీలో పాల్గొని నగర ప్రజలను చాలా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును గౌరవ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద , అడిషనల్ కలెక్టర్ శ్రీమతి సంధ్యారాణి, డాక్టర్ సాంబశివరావు తోపాటు జిల్లా అధికారులందరూ అభినందించారు, కోడిమాల శ్రీనివాసరావు( హెచ్ఐవి ఎయిడ్స్ స్టేట్స్ రిసోర్స్ పర్సన్) మాట్లాడుతూ హెచ్ఐవి అంటూ వ్యాధి కాదని -అంటించుకునే వ్యాదని ఈ వ్యాధి నుండి కాపాడుకోవాలంటే చెడు అలవాట్లు లోను కాకుండా భారతీయ సంస్కృతిని పాటించి సురక్షితమైన శృంగారం, కలుషితం లేని రక్తం, కలుషితం కానీ చిరంజీలు ,నీడిల్స్ ఇతర బ్లేడ్స్ వాడి హెచ్ఐవి బారిన పడకుండా ఉండాలని ముఖ్యంగా యువత ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యసాధన కోసం ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సొసైటీ బాధ్యులు దేవి శ్రీ ప్రసాద్ ,శివరాజ్, రిత్విక్ ,రోహిత్, విష్ణు, ఎన్జీవోస్ రేణుక, ప్రవళిక, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


